![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -15 లో...... చందు తన లవర్ కి పెళ్లి అయిందని బాధలో డ్రింక్ చేస్తాడు. మరొకవైపు చందు కోసం ధీరజ్ వెతుకుతాడు. భద్రవతి కార్ కి చందు అడ్డువస్తాడు. చందుని చూసి వీడు రామరాజు పెద్ద కొడుకు కదా బుద్దిమంతుడు కదా ఇలా డ్రింక్ చేసాడేంటి అనుకొని డ్రైవర్ కి చెప్పి.. వాడిని ఎక్కించుకొని ఎందుకు తాగాడో చాకచక్యంగా అడుగమని భద్రావతి చెప్తుంది.
ఆ తర్వాత అతను చందు ని ఎక్కించుకొని ఎందుకు తాగావని అడుగుతాడు. నా లవర్ కి పెళ్లి అయిందని చందు చెప్తాడు. మా నాన్న అంటే చెప్పలేని గౌరవం అంతకుమించి భయమని చందు చెప్తాడు. ఆ తర్వాత భద్రావతి సైగ చెయ్యగానే చందుని దింపేస్తాడు. ఆ తర్వాత చందు దగ్గరికి ధీరజ్, సాగర్ లు వెతుకుతూ వస్తారు. తనని ఇంటికి తీసుకొని వెళ్తారు సాగర్ లోపలికి వెళ్తుంటే.. నువ్వు ఎందుకు వెళ్తున్నావని అన్నయ్య నీ తీసుకొని వెళదామని ధీరజ్ అనగానే.. వాడితో పాటు నన్ను కూడ తాగానని అనుకుంటాడు అని సాగర్ అంటాడు. నీది భయమో, స్వార్థమో అర్ధం కాదని ధీరజ్ అంటాడు. ఇక లోపలికి వెళ్తుంటే రామరాజు చూస్తాడు. ఇక చందు నాన్నపై తనకి ఉన్న ప్రేమని చెప్తాడు. అయిన వీడు తాగడం ఏంటని రామరాజు అనగానే పెళ్లి లో కూల్ డ్రింక్ లో మందు కలిపారని ధీరజ్ కవర్ చేస్తాడు. అయినా నువ్వేం చేస్తున్నావని ధీరజ్ పై రామరాజు కోప్పడతాడు.
ఆ తర్వాత భద్రావతి ఇంటి ముందు బాంబులు పేలుస్తుంది. అది చూసి మా అక్క ఎన్ని రోజులు అవుతుంది. ఇలా సంతోషం గా ఉండి అని రామరాజుతో వేదవతి అంటుంది. ఏంటి వదిన దీపావళి అయిపోయింది బాంబులు పేలుస్తున్నారని తన మరదలు అడగనే.. ఆ రామరాజు కొడుకులు తన బలం.. పరువు అంటాడు కదా తన పెద్ద కొడుకు వళ్ళ తన కుటుంబం పతనం మొదలవుతుందని భద్రావతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ విషయం వేదవతికి చెప్పాలని తన తల్లి అనుకుంటుంది. తరువాయి భాగంలో సాగర్ దగ్గరికి నర్మద వచ్చి వారం రోజుల్లో ఎంగేజ్మెంట్ అని చెప్తుంది. రేపు మీ వాళ్లందరిని తీసుకొని రా మన పెళ్లి గురించి మాట్లాడుదామని సాగర్ కి నర్మద చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |